Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

యోబు1

Job 1:1  ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 
Job 1:2  అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తె లును కలిగిరి. 
Job 1:3  అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. 
Job 1:4  అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. 
Job 1:5  వారి వారి విందుదిన ములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను. 
Job 1:6  దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. 
Job 1:7  యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాదిభూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను. 
Job 1:8  అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు. 
Job 1:9  అని అడుగగా అపవాదియోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? 
Job 1:10  నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. 
Job 1:11  అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా 
Job 1:12  యెహోవాఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను. 
Job 1:13  ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి 
Job 1:14  ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి 
Job 1:15  ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను. 
Job 1:16  అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను. 
Job 1:17  అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను. 
Job 1:18  అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చినీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా 
Job 1:19  గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను. 
Job 1:20  అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను 
Job 1:21  నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలు గునుగాక. 
Job 1:22  ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. 

యోబు2

Job 2:1  దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. 
Job 2:2  యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచ రించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. 
Job 2:3  అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జిం చిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా 
Job 2:4  అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. 
Job 2:5  ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. 
Job 2:6  అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. 
Job 2:7  కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. 
Job 2:8  అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా 
Job 2:9  అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. 
Job 2:10  అందుకతడుమూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు. 
Job 2:11  తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. 
Job 2:12  వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి. 
Job 2:13  అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి. 

యోబు3

Job 3:1  ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. 
Job 3:2  యోబు ఈలాగు అనెను 
Job 3:3  నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాకమగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక. 
Job 3:4  ఆ దినము అంధకారమగును గాకపైనుండి దేవుడు దాని నెంచకుండును గాకవెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక 
Job 3:5  చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక 
Job 3:6  అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాకసంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాకమాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. 
Job 3:7  ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాకదానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక 
Job 3:8  దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించు దురు గాక. 
Job 3:9  అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక 
Job 3:10  అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని? 
Job 3:11  గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని? 
Job 3:12  మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని? 
Job 3:13  లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందునునేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును 
Job 3:14  తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును. 
Job 3:15  బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును. 
Job 3:16  అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును. 
Job 3:17  అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు 
Job 3:18  బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు 
Job 3:19  అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారుదాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు. 
Job 3:20  దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల? 
Job 3:21  వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది. 
Job 3:22  సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. 
Job 3:23  మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల? 
Job 3:24  భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. 
Job 3:25  ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది. 
Job 3:26  నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది. 

యోబు4

Job 4:1  దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను 
Job 4:2  ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు? 
Job 4:3  అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. 
Job 4:4  నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి. 
Job 4:5  అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. 
Job 4:6  నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? 
Job 4:7  జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా? 
Job 4:8  నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు. 
Job 4:9  దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు. 
Job 4:10  సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. 
Job 4:11  ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును. 
Job 4:12  నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. 
Job 4:13  గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను. 
Job 4:14  భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. 
Job 4:15  ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను. 
Job 4:16  అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెనుమెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగాదేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? 
Job 4:17  తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? 
Job 4:18  ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. 
Job 4:19  జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును? 
Job 4:20  ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురుఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు. 
Job 4:21  వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు. ఆలాగుననే జరుగుచున్నది గదా. 

యోబు5

Job 5:1  నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు? 
Job 5:2  దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశిం చెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు. 
Job 5:3  మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని. 
Job 5:4  అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు. 
Job 5:5  ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి 
Job 5:6  శ్రమ ధూళిలోనుండి పుట్టదు. బాధ భూమిలోనుండి మొలవదు. 
Job 5:7  నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము నకే పుట్టుచున్నారు. 
Job 5:8  అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును. 
Job 5:9  ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. 
Job 5:10  ఆయన భూమిమీద వర్షము కురిపించువాడుపొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు. 
Job 5:11  అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచునుదుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును. 
Job 5:12  వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండఆయన వారి ఉపాయములను భంగపరచును 
Job 5:13  జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనునుకపటుల ఆలోచనను తలక్రిందుచేయును 
Job 5:14  పగటివేళ వారికి అంధకారము తారసిల్లునురాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు 
Job 5:15  బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండిఆయన దరిద్రులను రక్షించును. 
Job 5:16  కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును. 
Job 5:17  దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 
Job 5:18  ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 
Job 5:19  ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించునుఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 
Job 5:20  క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును. 
Job 5:21  నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయునుప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. 
Job 5:22  పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును. 
Job 5:23  ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు 
Job 5:24  నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండునునీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు. 
Job 5:25  మరియు నీ సంతానము విస్తారమగుననియునీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును. 
Job 5:26  వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లుపూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు. 
Job 5:27  మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది ఆలాగే యున్నది. 

యోబు6

Job 6:1  ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను 
Job 6:2  నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక. 
Job 6:3  ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రములఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. 
Job 6:4  సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. 
Job 6:5  అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా? 
Job 6:6  ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా? 
Job 6:7  నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను. 
Job 6:8  ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక 
Job 6:9  దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. 
Job 6:10  అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును 
Job 6:11  నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? 
Job 6:12  నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా? 
Job 6:13  నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. 
Job 6:14  క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనిననుస్నేహితుడు వానికి దయచూపతగును. 
Job 6:15  నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి. 
Job 6:16  మంచుగడ్డలుండుటవలననుహిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును 
Job 6:17  వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. 
Job 6:18  వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును. 
Job 6:19  సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురుషేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు. 
Job 6:20  వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురువాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. 
Job 6:21  అటువలె మీరు లేనట్టుగానే యున్నారుమీరు ఆపదను చూచి భయపడుచున్నారు. 
Job 6:22  ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? 
Job 6:23  పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడనియడిగితినా? 
Job 6:24  నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదనుఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకుతెలియజేయుడి. 
Job 6:25  యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? 
Job 6:26  మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. 
Job 6:27  మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు, మీ స్నేహితులమీద బేరము సాగింతురు. 
Job 6:28  దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా? 
Job 6:29  అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడిమరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. 
Job 6:30  నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా? 

యోబు7

Job 7:1  భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా? 
Job 7:2  నీడను మిగుల నపేక్షించు దాసునివలెనుకూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను 
Job 7:3  ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి. నేను పండుకొనునప్పుడెల్ల 
Job 7:4  ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడు దును. 
Job 7:5  నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. 
Job 7:6  నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవినిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి. 
Job 7:7  నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. 
Job 7:8  నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును. 
Job 7:9  మేఘము విడిపోయి అదృశ్యమగునట్లుపాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు 
Job 7:10  అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు. 
Job 7:11  కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను. 
Job 7:12  నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు? 
Job 7:13  నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా 
Job 7:14  నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవుదర్శనములవలన నన్ను భయపెట్టెదవు. 
Job 7:15  కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము. 
Job 7:16  అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు. 
Job 7:17  మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల? 
Job 7:18  ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల? 
Job 7:19  ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా? 
Job 7:20  నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి? 
Job 7:21  నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.